KhammamPoliticalTelangana

మండలంలో హోలీ వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలి – ఎస్సై సంధ్యా

మండలంలో హోలీ వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలి – ఎస్సై సంధ్యా

మండలంలో హోలీ వేడుకలు జాగ్రత్తగా జరుపుకోవాలి – ఎస్సై సంధ్యా

సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 02 2026: మండలంలో హోలీ పండుగను శాంతి భద్రతలతో, సురక్షితంగా జరుపుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై సంధ్యా ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
పండుగ సందర్భంగా యువత అతిగా ఉత్సాహంతో బైకులపై ట్రిపుల్ రైడింగ్ చేయడం, సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యం కలిగించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా రసాయనిక రంగులు ఉపయోగించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, సహజ రంగులను మాత్రమే వినియోగించాలని సూచించారు.
అలాగే, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా బలవంతంగా రంగులు పూయడం, మహిళలు మరియు చిన్నారుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం వంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
హోలీ రోజున మండలంలోని ముఖ్య కూడళ్ల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రజలు పరస్పర గౌరవంతో, సామరస్యంతో పండుగను జరుపుకోవాలని, ఏదైనా అనుమానాస్పద సంఘటనలు గమనించినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్సై సంధ్యా కోరారు.
హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని పోలీసు శాఖ తరఫున మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button