
మా సర్పంచ్ అనుమతులు లేని పనులు చేస్తున్నారు..!
బైంసా : సర్పంచ్ అనుమతులేని పనులు చేస్తున్నాడంటూ ఆరోపిస్తూ,సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో ముధోల్ మండలంలోని పలువురు ఎడ్బీడ్ గ్రామస్తులు తమ సర్పంచ్ పై ఫిర్యాదు చేశారు.
గ్రామ పంచాయతీ ఆవరణలోని వేప చెట్టును ఫారెస్ట్ అధికారుల అనుమతులు లేకుండా తొలగించాడని, అలాగే ప్రహారీగోడ, టాయిలెట్లను సైతం అధికారుల అనుమతి లేకుండా కూల్చరని,
గ్రామ పంచాయతీ ఆవరణలో గల బందెల దొడ్డి కి చెందిన స్థలాన్ని గ్రామ సభ ద్వారా గ్రామ పంచాయతీ సభ్యులందరి తీర్మానం లేకుండానే ఆ స్థలంలో ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.




