
ఇద్దరు చిన్నారులను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
Web desc : తాను చనిపోతే తన పిల్లలను ఇంకెవరు పట్టించుకోరు అనుకుందో ఏమో తెలీదు కానీ ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఈ దారుణమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో జరిగింది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగత జీవులుగా మారడంతో గొల్లగూడెంం గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.
ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన ఇద్దరు బిడ్డలను చంపి తాను ఆత్మహత్కు పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే గొల్లగూడెం గ్రామానికి చెందిన మేకల మహేశ్ యాదవ్, ఐశ్వర్య దంపతులు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లల సంతానం.అయితే కొన్ని రోజులుగా ఈ దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఐశ్వర్య, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి అత్తారింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయారు. అదే రోజు రాత్రి ఇద్దరు చిన్నారులను మెత్తతో ఊపిరాడకుండా చేసి ఐశ్వర్య చంపేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ దారుణమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒకేసారి ముగ్గురు మృతిచెండంతో గొల్లగూడె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.



