
ఉపాధ్యాయుడిపై పిడిగుద్దులు కురిపించిన విద్యార్థి… వీడియో వైరల్
Web desc : క్లాస్ రూమ్‌లో దారుణం జరిగింది. చిన్న గొడవ కారణంగా ఉపాధ్యాయుడిపై విద్యార్థి పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగింది.
చిన్న కారణం గొడవగా మారడంతో విద్యార్థిని ఉపాధ్యాయుడు దుర్భాషలాడారు. దీంతో కోపోద్రికుడైన విద్యార్థి అందరూ చూస్తుండగా, వీడియో తీస్తున్నా సరే ఉపాధ్యాయుడిపై పిడుగుద్దులు కురిపించారు. మిగిలిన టీచర్లు చెబుతున్నా వినకుండా స్టూడెంట్ దాడి చేయడంతో ఉపాధ్యాయుడి విలవిలలాడిపోయారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాధ్యాయుడు దుర్భాషలాడటంపై కొందరు విమర్శస్తుంటే మరికొందరు మాత్రం చిన్న వయసులో విద్యార్థిని ఇప్పుడు కట్టడి చేయాలని, లేని పక్షంలో ఉన్మాదిగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.


