PoliticalTelangana

స్కానింగ్ సెంటర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక..

స్కానింగ్ సెంటర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక..

స్కానింగ్ సెంటర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక..

Web desc : ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా స్కానింగ్ సెంటర్‌లో ఓ మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటనపై విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.

జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన బాలిక, తన అమ్మమ్మ గారి ఊరికి చెందిన తన వయసే ఉన్న బాలుడితో ఎస్ఎస్సీ పరీక్షలు రాశారు. ఈ సమయంలోనే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్నారు. ఆ బాలిక ఎస్ఎస్సీ ఉత్తీర్ణత అనంతరం జిల్లాలోని ఒక కేజీబీవీలో చేరి ఇంటర్ చదువుతోంది.

ఈ క్రమంలో సెలవు రోజుల్లో బాలిక తన అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు.. వారి ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు బాలుడు, బాలిక ఏకాంతంగా గడిపేవారు అని సమాచారం. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తను చదువుతున్న కేజీబీవీలో విషయం బయటకు రాకుండా ఉండటానికి ఆ బాలిక వదులుగా ఉండే దుస్తులు, గర్భం దాల్చిన విషయం బయటకు కనిపించకుండా ఉండేందుకు గట్టి పట్టీలను కట్టుకునేది అని తెలుస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో నేను ఆరోగ్యంగానే ఉన్నాను.

నాకు ఎలాంటి సమస్యలు లేవు.. తదితర మాటలతో వైద్య పరీక్షలు చేయించుకునేది కాదు అని సమాచారం. బాలికల ఆరోగ్య విషయాలను ఈ నెల నెల పరీక్షించి నివేదికలను ఉన్నత అధికారులకు పంపవలసిన కేజీబీవీ సిబ్బంది బాలిక పరిస్థితిని అంచనా వేయకపోవడం వారి నిర్లక్ష్యం స్పష్టం చేస్తోంది.

విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణాలపై నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button