
చిట్టి డబ్బులు ఇవ్వలేదని సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మ*హత్య…
తూప్రాన్ : చిట్టి డబ్బులు ఇవ్వట్లేదని వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శివంపెట్ మండల గంగాయపల్లి లో చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరబాద్ మండలం పోతారం గ్రామ సర్పంచి భర్త పుట్ట మహేందర్ చిట్టీల వ్యాపారం చేస్తుండేవాడు.
కాగా అతని దగ్గర శివంపేట మండలం గంగాయపల్లి కి చెందిన శ్రీశైలం యాదవ్ చిట్టి వేశారు. కొన్ని డబ్బులు ఇవ్వగా ఇంకా కొన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది. చాలా రోజులు అవుతున్న ఇవ్వట్లేదని మనస్తాపానికి గురైన శ్రీశైలం నిన్నఉరివేసుకుని చనిపోయాడు.
దీనితో బాధిత కుటుంబ సభ్యులు పోతారం గ్రామ ఎంజెట్ మహేందర్ ఇంటి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. దీంతో పెద్దలు మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



