
నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..
Web desc : ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు.
అయితే.. నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగింది. ఈవెంట్ ఎవరు నిర్వహించారో కానీ.. సాక్షాత్తూ సినిమా హీరోనే కింద పడేశారు.
నిర్వాహకులు ఏర్పటు చేసిన ప్రత్యేక కుర్చీలో కూర్చున్న హీరో నాగచైతన్య కుర్చీ తూలిపోయి ఒక్కసారిగా కింద పడిపోయారు. దీంతో అక్కడ ఆందోళన చెలరేగింది. వెంటనే సిబ్బంది కూడా అలెర్ట్ అయ్యారు. చిత్ర యూనిట్, టీమ్ ఆందోళనకు గురయ్యారు.
కానీ, నాగచైతన్య హుందాగానే వ్యవహరించారు. ఆయనకు గాయాలేమీ కాలేదు. వెంటనే లేచి నుంచున్నారు. పక్కనున్న వారు అలెర్ట్ అయి నాగచైతన్యను పట్టుకున్నారు.
తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా హుందాగా వ్యవహరించి ప్రోగ్రామ్ నడిపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అసలే హీరో.. పైగా నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో నిర్వాహకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి.
వేసే కుర్చీ దగ్గర నుంచీ అన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. స్టేజీపై ఏర్పాటు చేసిన కుర్చీ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పెద్ద కార్యక్రమాల్లో భద్రత, నిర్వహణ ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ఉండాలో ఈ సంఘటన నిరూపించింది.




