
నూతన వధూవరులకు మంత్రి పొంగులేటి ఆశీర్వాదం
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.
తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను కానుకగా అందించి, వారు “నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో చల్లగా ఉండాలి” అని దీవించారు.
కూసుమంచి : మండల కేంద్రంలోని శ్రీ విజయరామ ఫంక్షన్ హాల్‌లో జరిగిన బోనగిరి వెంకటేశ్వరరావు కుమారుని వివాహ వేడుకకు మంత్రి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ఖమ్మం నగరం : ఖానాపురంలోని మొగిలి పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఇంటూరి పుల్లయ్య కుమారుని పెళ్లికి, ఖమ్మం బైపాస్ రోడ్డులోని వాసిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఎంపీఓ చిప్పా శివ కుమార్తె వివాహానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు.
రెడ్డిపల్లి (ఏదులాపురం): ఏఆర్ గార్డెన్స్‌లో జరిగిన మద్దినేని అశోకరావు కుమారుని వివాహ వేడుకలో పాల్గొని వధూవరులకు పట్టువస్త్రాలు బహూకరించారు.
ఏన్కూరు అండ్ తల్లాడ: ఏన్కూరు మండలం నాచారంలో ముక్తి వెంకటేశ్వర్లు కుమారుని వివాహానికి, తల్లాడ మండలం కుర్నవల్లిలో అయిలూరి శ్రీనివాసరెడ్డి కుమారుని వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను దీవించారు.



