Uncategorized

రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ – డీలర్‌పై కేసు నమోదు…

రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ – డీలర్‌పై కేసు నమోదు…

నాగిలిగొండ రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీ – డీలర్‌పై కేసు నమోదు…

సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.

ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలోని రేషన్ దుకాణంలో జిల్లా సివిల్ సప్లైస్ అధికారి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న రేషన్ బియ్యం మరియు ఇతర సరుకుల నిల్వలను పరిశీలించగా రికార్డులలో ఉన్న పరిమాణంతో పోలిస్తే నిల్వలో తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ అక్రమాల నేపథ్యంలో రేషన్ డీలర్‌పై 6-A కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు అందించాల్సిన నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వ ఉంచడం లేదా దారి మళ్లించడం సహించబోమని అధికారులు హెచ్చరించారు. రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button