HyderabadPoliticalTelangana

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్‌ఐ జి. వెంకటేష్ సస్పెండ్

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్‌ఐ జి. వెంకటేష్ సస్పెండ్

విధి నిర్వహణలో నిర్లక్ష్యం.. ఎస్‌ఐ జి. వెంకటేష్ సస్పెండ్

Web desc : హైదరాబాద్ పాతబస్తీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన ఆరోపణల నేపథ్యంలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ జి. వెంకటేష్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసు శాఖ నిబంధనలు, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం వంటి అంశాలు బయటపడటంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

సమాచారం ప్రకారం గణేష్ ఉత్సవాల బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి నిర్వహించిన కీలక సమావేశానికి ఎస్‌ఐ వెంకటేష్ గైర్హాజరైనట్లు గుర్తించారు. అలాగే నెహ్రూ నగర్ ప్రాంతంలో జరిగిన ఘటనలో రౌడీషీటర్ నిస్సార్‌పై తగిన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇదే కాకుండా ముఖ్యమంత్రి రూట్ బందోబస్తు విధులకు హాజరు కాకపోవడం, ఎన్నికల డ్యూటీలు, లోకదాలత్ సమావేశాలకు గైర్హాజరు కావడం వంటి విషయాలు కూడా అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. డ్యూటీల కేటాయింపులో మతపరమైన భేదాలు చూపినట్లు వచ్చిన ఆరోపణలు కూడా తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సేవా నియమావళి (టీజీసీఎస్ ) ప్రకారం ఎస్‌ఐ జి. వెంకటేష్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై సస్పెన్షన్ కొనసాగుతుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పోలీసు శాఖలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విధి నిర్వాహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమనే సందేశాన్ని ఈ చర్య ద్వారా ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు భావిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button