
తల్లాడ రేంజ్లో చిరుత సంచారం..
ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని రేంజ్లో చిరుత సంచారిస్తుంది. జిల్లాలో రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో చిరుత పులి, ఎలుగుబంటి సంచారానికి సంబంధించిన దృశ్యాలు నమోదయ్యాయి.
తల్లాడ రేంజ్ పరిధిలోని కనకగిరి- పులిగుండాల అటవీ ప్రాంతల మధ్య చిరుత తన పిల్ల కునతో చిరుత సంచారం చేస్తుందని సమాచారం ఉంది.
కానీ ఫారెస్ట్ అధికారులు ఎంత గాలించిన చిరుత ఆచూకీ దొరకలేదు. దీంతో అడవిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత విజువల్స్ కనిపించాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఫారెస్ట్ అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఈ పరిణామం జిల్లాలోని అడవి పర్యావరణం వ్యవస్థను వన్యప్రాణాలు ఆరోగ్యకరమైన జీవనానికి నిదర్శనంగా నిలుస్తుందని.. అదేవిధంగా వన్యప్రాణుల జనాభాను శాస్త్రీయంగా పర్యవేక్షించడానికి,
జీవవైవిద్య నమునాలను అర్థం చేసుకోవడానికి అటవీశాఖ నిరంతరం కృషి చేస్తుంది అని.. ఖమ్మం జిల్లా పరిధిలోని అడవుల్లో మెరుగైన ఆవాస పరిస్థితులు, పర్యావరణ సమతుల్యత వల్లే వన్య ప్రాణులు ఉనికి సాధ్యమైందని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు.



