HyderabadPoliticalTelangana

వాతావరణ శాఖ కేంద్రానికి బాంబ్ బెదిరింపు…. బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

వాతావరణ శాఖ కేంద్రానికి బాంబ్ బెదిరింపు…. బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

వాతావరణ శాఖ కేంద్రానికి బాంబ్ బెదిరింపు…. బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు

హైదరాబాద్ నగరంలోని IMD కార్యాలయానికి బాంబు బెదిరింపు

14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ దుండగులు

వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చిన IMD సిబ్బంది

ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగులను సురక్షిత ప్రాంతానికి తరలించి, బాంబు స్క్వాడ్ సహాయంతో ప్రతి గదిని తనిఖీ చేస్తున్న పోలీసులు

ఇటీవల ఎయిర్ పోర్ట్స్, స్కూల్స్,కోర్టులకు బాంబ్ బెదిరింపులు ఎక్కువయ్యాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రంలో 14 ఆర్డీఎక్స్ బాంబులను అమర్చినట్లు మెయిల్ వచ్చింది. విషయం తెలిసిన ఉద్యోగులు ఆఫీసు నుంచి బయటకు పరుగులు తీశారు.

వాతావరణశాఖ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు.వాతావరణ శాఖ కేంద్ర దగ్గ పోలీసులు భారీగా మోహరించారు.

ఆకతాయిల పని కావొచ్చని భావిస్తున్నా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా క్షణ్ణంగా కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. ఉద్యోగులు,ప్రజలు టెన్షన్ పడొద్దని పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.

మెయిల్స్ పంపించింది ఆకతాయిలా? లేక ఏదైనా ఉగ్రవాద సంస్థనా? అనే కోణంలో సైబర్ క్రైం పోలీసులు విచారిస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టుతో పాటు పలు జిల్లా కోర్టులకు బాంబ్ బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

దేశ వ్యాప్తంగా ఇలాంటి బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం సాధారణమైపోయింది. అయినా పోలీసులు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button