NationalNotification

పోస్టల్‌ GDS 1 మెరిటి లిస్ట్‌ విడుదల.. సెలక్ట్‌ అయ్యారా? ఇలా చెక్‌ చేసుకోండి..

పోస్టల్‌ GDS 1 మెరిటి లిస్ట్‌ విడుదల.. సెలక్ట్‌ అయ్యారా? ఇలా చెక్‌ చేసుకోండి..

India Post GDS Result 2026: పోస్టల్‌ GDS 1 మెరిటి లిస్ట్‌ విడుదల.. సెలక్ట్‌ అయ్యారా? ఇలా చెక్‌ చేసుకోండి..

భారత తపాల శాఖలో గ్రామీణ ఢాక్‌ సేవక్‌ ఫలితాలు 2026 అభ్యర్థులు మెరిట్ లిస్టు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ https://indiapost.gov.in/gdsonlineengagement ఫలితాలు పొందుపరిచారు. పీడీఎఫ్ లో సులభంగా పోస్టల్ శాఖకు సంబంధించిన ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తంగా 28,636 గ్రామీణ ఢాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది.

ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితాలు 2026 డౌన్‌లోడ్ చేసుకునే విధానం.. భారత తపాలా శాఖ చేపట్టిన రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తు చేసుకున్నవారు ముందుగా https://indiapost.gov.in/gdsonlineengagement ఓపెన్ చేసి అక్కడ హోం పేజీతో ‘షార్ట్ లిస్ట్ క్యాండిడేట్’ సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మీ రాష్ట్రం ఎంపిక చేసుకుని వివరాలను నమోదు చేసుకుంటే ‘లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్ట్’ అయిన అభ్యర్థుల జాబితా ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు పీడీఎఫ్‌ రూపంలో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ఈ మెరిట్ లిస్టులో షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు వివరాలు ఉంటాయి. డివిజన్ ఆఫీస్, పోస్ట్ ఐడి, పోస్ట్ నేమ్, పోస్ట్ కమ్యూనిటీ, రిజిస్ట్రేషన్ నంబర్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. అభ్యర్థులు వెంటనే వారు ఏ డివిజన్‌కు ఎంపికయ్యారు సరి చూసుకోవాలి.

తుది ఎంపిక ఎలా? భారతీయ తపాలా GDS సెలక్షన్ ఆటోమేటిక్ మెరిట్ సిస్టం ద్వారా ఎంపిక చేస్తుంది. మెరిట్ ఆధారంగా మార్కులు పదో తరగతికి సంబంధించి ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది.

ఈ రిక్రూట్మెంట్ కేవలం పదో తరగతి అర్హతతో చేపట్టారు. కాబట్టి ఎక్కువ శాతం మంది ఇందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక అభ్యర్థికి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే వర్తిస్తుంది.

ఇండియా పోస్ట్ జీడీఎస్ మెరిట్ జాబితాలో ఎంపికైతే ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. అభ్యర్థులు డివిజన్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలి. వెరిఫికేషన్ ప్రక్రియ మార్చి 23వ తేదీ ముందే పూర్తి అవ్వచ్చు. అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమతో పాటు తీసుకువెళ్లాలి.

రెండు సెట్ల ఫోటో కాపీలు, 10వ తరగతి మార్కుల లిస్టు, ఐడెంటి ప్రూఫ్, కుల ధ్రువీకరణ పత్రం, అడ్రస్ ధృవీకరణ పత్రం కూడా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇందులో కూడా పాస్ అయిన అభ్యర్థులకు ఫైనల్ అపాయింట్మెంట్ లెట్టర్‌ విడుదల చేస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button