
మరో వివాదంలో నటుడు రాజేంద్ర ప్రసాద్ !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది నటులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు.
ఇండస్ట్రీని దున్నేస్తుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేస్తూనే ఇండస్ట్రీలో ఎదిగిన రాజేంద్ర ప్రసాద్ , ఒకప్పుడు కామెడీ, ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పటికీ ఆ సినిమాలను టీవీలలో జనాలు ఎగబడి చూస్తూ ఉంటారు.
ఇక ప్రస్తుతం ఆయన హీరో లేదా హీరోయిన్ తండ్రి పాత్రలలో మెరుస్తున్నారు. అలాంటి గొప్ప నటుడు రాజేంద్ర ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫోటో అడిగిన ఓ కుర్రాడిని తోసేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన వైరల్ గా మారింది.
మరో వివాదంలో నటుడు రాజేంద్ర ప్రసాద్ : తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడి వివాహం తాజాగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, దిగ్గజాలు ఈ పెళ్లి కార్యక్రమానికి వచ్చారు.
ఇందులో భాగంగానే నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన పని వివాదంగా మారింది. సెల్ఫీ అడిగిన ఓ పిల్లాడిని, చిరాకుగా పక్కకు తోసేసాడు రాజేంద్ర ప్రసాద్. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఇక ఇది చూసిన నెటిజెన్స్ తమ స్టైల్ లో రియాక్ట్ అవుతున్నారు. సెల్ఫీ అడిగితే ఇవ్వాలి, లేదా కుదరదని చెప్పాలి. కానీ ఇలా ఆ కుర్రాడిని తోసేయడం ఏంటి ? కొంచమైనా రాజేంద్ర ప్రసాద్ కు బుద్ధి ఉందా ? అంటూ సీరియస్ అవుతున్నారు నెటిజన్స్. వెంటనే ఆ కుర్రాడికి రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
జనాలు టికెట్లు కొని సినిమా చూస్తే బతికే రాజేంద్ర ప్రసాద్ ఇలా వ్యవహరించడం చాలా తప్పు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో సినిమా వేదికల పైన కూడా రాజేందర్ ప్రసాద్ నోరు జారడం చూసాం.
బ్రహ్మానందం లాంటి నటులనే టార్గెట్ చేసి వేదికల పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. అలాంటి సంఘటనలు మరువకముందే ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకున్నారు.



