
జాతరలో ఎస్ఐపై దాడి.. కేసు నమోదు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో జాతరలో గొడవ జరగుతుండగా సర్ది చెప్పడానికి వెళ్లిన ఎస్ఐ కాలర్ ను ఓ వ్యక్తి పట్టుకోవడంతో పాటు దాడి చేశాడు.
జాతరలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.
వివాదం గురించి మాట్లాడుతున్న క్రమంలో చెన్నబోయిన రమేష్ అనే వ్యక్తి సహనం కోల్పోయి ఎస్సై కాలర్ పట్టుకుని దాడి చేసి తోసేశాడు. ఎస్సై కాలర్ పట్టుకున్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
స్థానిక ప్రజాప్రతినిధులు కేసు నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలన్నీ సిసి టివి కెమెరాలో రికార్డయ్యాయి.




