Mahabub nagarPoliticalTelangana

భార్యాభర్తల ఆత్మ*హత్యాయత్నం…

భార్యాభర్తల ఆత్మ*హత్యాయత్నం…

భార్యాభర్తల ఆత్మ*హత్యాయత్నం…

Web desc : నవాబుపేట మండల పరిధిలోని జంగమయ్యపల్లి గ్రామంలో జరిగిన భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం సంఘటన ఆదివారం విషాదాంతంగా ముగిసింది. సంఘటన జరిగిన రోజే భార్య మురుగని లావణ్య(22) మృతి చెందగా, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న భర్త మురుగని రవి(25) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు.

ఆత్మహత్యాయత్నం అనంతరం తీవ్ర పరిస్థితిలో ఉన్న రవిని ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆయనకు సుమారు రెండు రోజులు చికిత్స అందించారు.

అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఆ ఆస్పత్రిలో ఎంతకు కూడా మెరుగు పడకపోగా మరింత విషమంగా మారడంతో ఆయనకు చికిత్స నిర్వహించిన జిల్లా ఆస్పత్రి వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు.

కుటుంబ సభ్యులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రవిని ఎలాగైనా దక్కించుకోవాలనే తాపత్రయంతో శనివారం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించిన వైద్యులు కూడా ఆయనను రక్షించేందుకు అనేక రకాలుగా ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకపోయింది.

అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రవి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనలో సంఘటన జరిగిన రోజే ఆయన భార్య మృతి చెందింది.

భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోవడంతో వారు అల్లారుముద్దుగా పెంచుకున్న 11 నెలల పాప అనాథగా మారింది.

కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప తల్లిదండ్రులు ఇక లేరన్న విషాదం గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. చిన్నారి భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన జంగమయ్య పల్లి గ్రామస్తులలో వ్యక్తమవుతోంది

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button