
సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్
సీఎం చంద్రబాబు కాన్వాయ్ ట్రయల్ రన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్ ఢీకొని యువకుడు మృతి చెందారు. ఈ ఘటన మార్కాపురం జిల్లా దోర్నాల మండలం చిన్న గుడిపాడు వద్ద జరిగింది.
సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు కాన్వాయ్ వ్యానుతో ట్రయల్ రన్ నిర్వహించారు. అయితే ఈ రన్‌లో అపశృతి చోటు చేసుసుకుంది. బైకర్ అంకన్న(25)ను కాన్వాయ్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో అంజన్న అక్కడికక్కడే మృతి చెందారు.
కానీ రాంగ్ రూట్లో వెళ్లి మరీ బైక్ ను కాన్వాయ్ వ్యాను ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు




