
సైబర్ మోసానికి గురైన కౌన్సిలర్ భర్త
Web desc : ఓ పక్క సైబర్ మోసాలు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాల వలలో పడకుండా పోలీసులు ఓవైపు జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం సైబర్ మోసానికి అమాయకంగా గురైపోయాడు.
తాజాగా సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఓ కౌన్సిలర్ భర్త సైబర్ మోసానికి చిక్కుకున్నాడు. తన ఫోన్ కి వచ్చిన లింకును తెలియకుండా ఓపెన్ చేయడంతో ఏకంగా రూ.7.79 లక్షలు పోగొట్టుకొని లబోదిగిపోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట పట్టణంలోని 14 వార్డు బీజేపీ కౌన్సిలర్ ఉమారాణి భర్త ఉల్లిగడ్డల నాగన్న అకౌంట్లో నుంచి మూడు విడతలుగా రూ.7 లక్షల 79 వేలు డబ్బులు డెబిట్ అయ్యాయి.
అయితే తన ఫోనుకు ఓ లింక్ వచ్చిందని, అది మున్సిపల్ ఆఫీస్ నుంచి రావడంతో లింక్ ఓపెన్ చేశాడు. అయితే తన ఫోన్కు ఎలాంటి ఓటీపి రాకుండానే తన ఖాతాలో నుంచి డబ్బులు మాయమైనట్టు మెసేజ్ ద్వారా గుర్తించాడు.
దీంతో బాధితుడు నాగన్న తాను సైబర్ మోసానికి గురైనట్టు గుర్తించి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




