
అనారోగ్యంతో భర్త మృతి.. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని భార్య ఆత్మ*హత్య..
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో భర్త మరణించడంతో తట్టుకోలేకపోయిన భార్య పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ( మార్చి 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
జిల్లాలోని వీణవంక మండలం మామిడాలపల్లిలో చోటు చేసుకుంది ఈ ఘటన. మామిడాల పల్లి గ్రామానికి చెందిన శంకరయ్య, పద్మ బార్యాభర్తలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య మరణించాడు.
భర్త మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన భార్య పద్మ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పద్మ కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త మరణం తట్టుకోలేకనే పద్మ ఆత్మహత్య చేసుకుందా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు




