KhammamPoliticalTelangana

ఖమ్మంలో కవిత అరెస్ట్.. ZP సెంటర్ దగ్గర ఉద్రిక్తత…

ఖమ్మంలో కవిత అరెస్ట్.. ZP సెంటర్ దగ్గర ఉద్రిక్తత…

ఖమ్మంలో కవిత అరెస్ట్.. ZP సెంటర్ దగ్గర ఉద్రిక్తత…

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జాగృతి అధ్యక్షరాలు కవితను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఖమ్మంలోని ZP సెంటర్ దగ్గర నిరసన చేపట్టిన కవితను అరెస్ట్ చేశారు ఖమ్మం 3 టౌన్ పోలీసులు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మెన్ విశరధన్ మహారాజ్, జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.

అంతకు ముందు బాధితులను పరామర్శించిన కవిత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.గతంలో వెలుగుమట్ల బాధితుల ఇళ్ళు కూల్చేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఇప్పుడు పాపాలను కడుక్కుంటోందని అన్నారు.

వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని..ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఈ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని అన్నారు.

పరీక్షల సమయంలో పుస్తకాలతో సహా ఇళ్లను కూల్చేశారని.. బాధితుల ఆవేదన, బాధ కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ గా మారిందని అన్నారు.

ముఖ్యమంత్రి, జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఈ సమస్యపై మాట్లాడాలని.. బాధితుల ఇళ్లు కూల్చిన చోటే వారికి కొత్త ఇళ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు కవిత.

రాష్ట్రంలో పేదలపై జులుం నడుస్తోందని.. పెద్ద వాళ్ల బిల్డింగ్ ల జోలికి వెళ్లటం లేదని అన్నారు. బాధితుల సమస్య పరిష్కారమయ్యే వరకు వారితో కలిసి పోరాటం చేస్తామని అన్నారు కవిత.

ప్రభుత్వానికి, నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని..ఒక ఆడబిడ్డ ఏడిస్తేనే ఇంటికి మంచిది కాదు… అలాంటిది ఇంత మంది ఆడబిడ్డల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని అన్నారు కవిత. పిల్లల ఎగ్జామ్స్ సమయంలో తల్లితండ్రులు ఎంతో ఆందోళనతో ఉంటారుని..

కానీ ఎగ్జామ్స్ సయమంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేశారని అన్నారు. బాధితుల ఇళ్లు కూల్చేస్తే చాలా మంది రాజకీయ నాయకులు ఎగ్జిబిషన్ చూసినట్లు చూసి వెళ్లారని మండిపడ్డారు.

బాధితులను చూసి వెళ్ళటానికి ఇక్కడికి రాలేదని..వాళ్ళ సమస్యలు సావధనంగా విని…వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించేందుకు వచ్చానని అన్నారు కవిత. బాధితులతో పాటు ఇక్కడ విశారదన్ మహారాజ్ గారు కూడా ఉన్నారని… ఆయన పట్టుపడితే వదలరని అన్నారు కవిత.

ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలతో పాటు జాగృతి కూడా మీకు తోడుగా ఉందని..ఒక పరిష్కారం వచ్చే వరకు కూడా మనం సమస్యను వదలకుండా పోరాటం చేద్దామని అన్నారు కవిత.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button