HyderabadKhammamPoliticalTelangana

మేమేదో టెర్రరిస్టులలాగా మా కాలనీని చుట్టుముట్టేశారు.. వెలుగుమట్ల బాధితురాలి ఆవేదన

మేమేదో టెర్రరిస్టులలాగా మా కాలనీని చుట్టుముట్టేశారు.. వెలుగుమట్ల బాధితురాలి ఆవేదన

మేమేదో టెర్రరిస్టులలాగా మా కాలనీని చుట్టుముట్టేశారు.. వెలుగుమట్ల బాధితురాలి ఆవేదన

ఖమ్మం అర్బన్‌ వెలుగుమట్ల భూదాన్‌ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితులు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.అప్పులు చేసి, బంగారాలు అమ్ముకుని ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను రేవంత్‌ సర్కార్‌ బుల్డోజర్లతో నేలమట్టం చేయడంపై కన్నీరుమున్నీరవుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భూదాన్‌ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసుల అత్యుత్సాహం ఎలా ఉందో ఓ బాధిత మహిళ చెప్పుకొచ్చింది. ప్రెస్‌ మీట్‌లో బాధిత మహిళ మాట్లాడుతూ.. ఉదయం 4 గంటలకే వచ్చి కాలనీ చుట్టుముట్టేశారు.

ఏదో దొంగల్లాగా.. మేమేదో పాకిస్తాన్‌ టెర్రరిస్టులలాగా చుట్టుముట్టేశారు. ఇదేంటి ఇంత జనం వచ్చారు. ఎప్పుడు లేదే..ఈ జనాలను చూసి చిన్నపిల్లలు ఏడుస్తున్నారు. కూల్చేస్తున్నారు. కనీసం అక్కడున్న వస్తువులు కానీ, బట్టలు తీసుకోవడానికి కానీ అవకాశం లేదు. ఏందయ్యా అంటే మీరెవరు మాట్లాడొద్దన్నారని చెప్పింది.

ఒక్క ఇంటికి ఐదుగురు మున్సిపాలిటీవాళ్లు, ఆరుగురు పోలీసులు కాపాలా కాసి ఎలా చేస్తున్నారంటే.. మీరు లోపలికి వెళ్లొద్దు.. ఏ సామాను కూడా ముట్టుకోవద్దు.. మీకే అధికారం లేదు అన్నట్టు దౌర్జన్యంగా వ్యవహరించారు..

బట్టలు తీసుకోవడానికి కానీ.. కనీసం అక్కడున్న ఆహారాన్ని తీసుకోనివ్వలేదు. కనీసం మేం కొనుక్కోని తెచ్చుకుని అక్కడే ఉన్న బియ్యం, నూనె, ఉప్పులు, పప్పులు కూడా తీసుకునే అవకాశమివ్వకుండా దారుణంగా కూల్చేశారు.

మేమేం ప్రభుత్వ భూముల్లో లేమే..మేం పేదల కోసం ఇచ్చిన భూదాన్ భూమిలోనే ఉన్నాం. అది మా భూమి. మేం ఉండే హక్కు మాకుంది.

మేం పేదోళ్లం కామని వాళ్లెట్లా చెప్తరు. కలెక్టర్ ఏ రోజన్నా వచ్చి సర్వే చేసినరా.. కలెక్టర్‌ కిటికీలో నుంచి ఇలా చూస్తే మా కాలనీ కనిపిస్తది. ఏ రోజైనా వచ్చి వీళ్లు నిజమైన పేదోళ్ల అని చూశారా..? అని ప్రశ్నించింది. మేం పేదవాళ్లం కాదని ఎలా చెప్పగలుగుతాడు.

మీకు వేరే దగ్గర ప్లేసులిస్తాం.. ఇంటి స్థలాలిస్తాం.. అక్కడెళ్లి ఉండండి.. అని ఇప్పుడు మంత్రులు అంటున్నారు. నిజమైన పేదోళ్లకు ఇండ్ల స్థలాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నరు. మాకు ఎక్కడా అవసరం లేదు. మీ భూమి ఇవ్వొద్దు.

మీ ఇండ్లల్లో ఇవ్వొద్దు. మా భూదాన్‌ భూముల్లోనే మా ఇంటి స్థలం కూలగొట్టిన దగ్గరే మాకు ఇల్లు కట్టి మాకు నష్టపరిహారం ఇస్తే చాలు.. మేం కోరుకునేది అదొక్కటే.. మా డిమాండ్‌ ఇదేనంటూ బాధిత మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button