
కేసీఆర్ సారీ చెప్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
Web desc : తానే స్వయంగా తెలంగాణలో రాజకీయ వ్యవస్థను బ్రాష్టుపట్టించాననీ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తప్పు చేశానని తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెబితే, ఆ మరుక్షణమే రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు.
అలా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పే ధైర్యం కేసీఆర్ కు ఉందా ? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే తమ రాజీనామాల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదని స్పష్టం చేశారు.
అసలు అనర్హత పిటిషన్ కు అర్హత లేదు. పార్టీ ఫిరాయింపులపై దాఖలైన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల పిటిషన్ లు చట్ట బద్దం కావని, అసలు అనర్హత పిటిషన్ కు అర్హత లేదని అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నియామవళి ప్రకారం పార్టీ ఫిరాయింపుకు పాల్పడితే ఆ సభ్యునికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని అన్నారు. అలా నాకు ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదని, వివరణ తీసుకోలేదని తెలిపారు.
పార్టీ విప్ ఏనాడూ దిక్కరించలేదని వెల్లడించారు. కేసీఆర్ ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడలేదని, పార్టీ పరంగా కేసీఆర్ ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు.



