
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి…
ఖమ్మం నగరంలోని త్రీటౌన్ పరిధిలో బుధవారం అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచైందింది.
సీఐ మోహన్‌బాబు కథనం ప్రకారం.. నక్కా వెంకటరమణ (33) అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆమె భర్త మల్లేశ్ గత నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు మృతిచెందాడు.
దీంతో ఆమె ఖమ్మంలోని శ్రీనివాసర్‌నగర్ ప్రాంతంలో ఉంటున్న ఆమె తండ్రి వంగూరి సైదులు ఇంటికి వచ్చింది. మంచంపై మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
కాగా, తన అక్క మృతిపై అనుమానం ఉందని ఆమె సోదరుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సాయంతో మార్చురికి తరలించారు.




