
గుండె పోటుతో సర్పంచ్ మృ*తి…
కారేపల్లి: మండలంలోని పాతకమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ తేజావత్ బాబూరావు (50) గుండెపోటుతో బుధవారం సాయంత్రం మృతి చెందగా పలువురు నివాళులర్పించారు.
పాతకమలాపురం గ్రామ పంచాయతీ చిమ్నాతండా గ్రామానికి చెందిన తేజావత్ బాబూరావు కాంగ్రెస్ పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో పని చేయించి సాయంత్రం 6 గంటల సమయంలో బాబూరావు ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో కుప్పకూలిపోగా కుటుంబ సభ్యులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య హైమావతి, ఇద్దరు కుమార్తెలు మమత, తేజస్విని, కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు.



