HealthPoliticalTelanganaVemulawada

నిండుగర్భిణి గెంటివేత… ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది నిర్వాకం

నిండుగర్భిణి గెంటివేత… ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది నిర్వాకం

నిండుగర్భిణి గెంటివేత… ప్రభుత్వ దవాఖానలో సిబ్బంది నిర్వాకం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చిన నిండు గర్భిణికి చేదు అనుభవం ఎదురైంది.
దవాఖానకు వచ్చిన ఆమెకు సేవలందించాల్సింది పోయి.. లోపలికి రానివ్వకుండా నర్సింగ్‌ సిబ్బంది అడ్డుకున్నారు.

ఇక్కడ వైద్యురాలు లేదని, సిరిసిల్లకు వెళ్లాలని బయటి నుంచి బయటికే వెళ్లగొట్టారు. బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగికి చెందిన రాచకొండ గౌతమి నిండు గర్భిణి.

ఆమెకు ఇబ్బందిగా ఉండటంతో తల్లి అంజమ్మతో కలిసి గురువారం రాత్రి 8గంట ప్రాంతంలో 108 వాహనంలో వేములవాడ ఏరియా దవాఖానకు చేరుకున్నారు.

గర్భిణిని తీసుకువచ్చామని 108 సిబ్బంది నర్సుకు తెలుపగా.. ఇకడ వైద్యురాలు అందుబాటులో లేదని, తాము తీసుకోబోమని లోనికి రాకుండా అడ్డుకున్నారు.

ఇబ్బందిగా ఉందని, కొంచెం పరీక్షలు చేసి అయినా రెఫర్‌ చేయండి అంటూ కోరినా ఆమె వినకుండా విరుచుకుపడింది. చేసేదేమి లేక మరో 108 వాహనంలో ఆమెను సిరిసిల్ల దవాఖానకు తరలించారు.

జిల్లాలోనే రెండో పెద్ద దవాఖాన అయిన వేములవాడలో నెల రోజులుగా గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదని సాక్షాత్తు విధుల్లో ఉన్న సిబ్బంది చెప్పిన తీరు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. సిబ్బంది వ్యవహరించిన తీరుపై గర్భిణి తల్లిదండ్రులు అంజమ్మ, లక్ష్మణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ విషయమై దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీందర్‌ను వివరణ కోరగా, వైద్య కళాశాల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వైద్యురాలు సెలవులో వెళ్లారని తెలిపారు.

మరో వైద్యురాలు కూడా లాంగ్‌ లీవ్‌లో ఉన్నారని, ప్రస్తుతం వైద్యులు అందుబాటులో లేరని చెప్పారు. జిల్లా అధికారులకు కూడా సమాచారం అందించామని పేర్కొన్నారు. వేములవాడ ఏరియా దవాఖానకు వచ్చే గర్భిణులను సిరిసిల్ల దవాఖానకు పంపిస్తున్నామని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button