
బీర్ బాటిల్‌లో పురుగు కలకలం…
Web desc : బీర్ బాటిల్‌లో పురుగు కనిపించిన ఘటన వరంగల్‌లో కలకలం రేపింది. ఎండ తీవ్రతతో చల్లగా బీర్ తాగాలని ఓ వ్యక్తి కరీమాబాద్‌లోని వైన్స్ షాపులో కేఎఫ్ లైట్ బీర్ కొనుగోలు చేశాడు.
కొంత తాగిన తర్వాత బీర్ రుచి తేడాగా అనిపించడంతో బాటిల్‌లో చూడగా, పురుగు కనిపించింది. దీంతో అతడు షాక్‌కు గురయ్యాడు. వైన్స్ నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా స్పందించారని బాధితుడు ఆరోపించాడు.
ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. కంపెనీల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని బీర్ ప్రియులు కోరుతున్నారు.



