
వాయిదాల చెల్లింపులో వివాదం.. కర్రలతో కొట్టుకున్న డ్వాక్రా గ్రూప్ మహిళలు
Web desc : డ్వాక్రా గ్రూపులో తీసుకున్న జమ డబ్బులు తిరిగి చెల్లింపు విషయంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి మహిళల మధ్య ఘర్షణకు దారితీసింది.
డ్వాక్రా గ్రూప్ మహిళలు ఒక్కరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పట్టణంలోని శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
జోగిపేట పట్టణంలోని బుడగజంగాల కాలనీ చెందిన డ్వాక్రా సంఘం మహిళల సభ్యులు మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్న పంచముఖ ఆలయం సమీపం వద్ద 10 మంది డ్వాక్రా సభ్యులు తీసుకున్న రుణం డబ్బులు చెల్లింపులో సమావేశం ఏర్పాటు చేసుకోగా.. జమ డబ్బులు రూ. 20 వేలు అప్పుగా తీసుకొని చెల్లింపు విషయంలో గ్రూపులోని ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి దాడికి పాల్పడ్డారు.
గత కొన్ని నెలలుగా డ్వాక్రా గ్రూప్ కు చెందిన డబ్బులను కొంత మంది సభ్యులు కట్టడంలేదని ప్రశ్నించగా, తాము రూ. 20 వేలను పూర్తిగా చెల్లించామని చెప్పడంతో ఘర్షణ కు దారి తీసింది.
డ్వాక్రా గ్రూప్ లీడర్ల మధ్య వాగ్వాదం పెరిగి దాడులు చేసుకునే స్థాయికి పెరిగింది. ఒక వర్గంపై మరో వర్గం మహిళలు కర్రలతో దాడికి దిగారు. దీంతో ఇరు వర్గాల వారు ఒకరినొకరు దాడులు చేసుకోగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొందరు మహిళలు 100 నెంబర్ కు ఫోన్ చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చేరుకొని, ఇరు వర్గాలను చెదరగొట్టి, ఘర్షణలో గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటనలో సాయమ్మ, అనిత, మల్లేశ్వరి వెంకటమ్మ, సంతోష, పూజ, దుర్గమ్మలకు ఘర్షణలో గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇందులో సాయమ్మకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
మంజుల, లక్ష్మి, అనిత, దాడి చేశారని గాయపడిన మహిళలు ఆరోపించారు. ఇదిలా ఉండగా జోగిపేట పోలీస్ స్టేషన్ లో టేకు అనిత, లక్ష్మి, సాయమ్మ, వెంకటమ్మ సంతోష, లక్ష్మిలు ఒక్కరిపై ఒక్కరు పరస్పరంగా ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



