HyderabadPoliticalTelangana

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినబ్ పంచాయతీ కార్యదర్శి…

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినబ్ పంచాయతీ కార్యదర్శి…

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినబ్ పంచాయతీ కార్యదర్శి…

‘ఇందిరమ్మ ఇంటి’ బిల్లుల కోసం లంచం డిమాండ్‌

Web desc : ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి బిల్లు చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. జోగుళాంబ గద్వాల జిల్లాలో అయిజ మండలంలోని ఎక్లాస్‌పురం గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బోయ రంగన్న ఇంటి నిర్మాణానికి సంబంధించిన బిల్లు చేసేందుకు లబ్ధిదారుల నుంచి రూ.20 వేలు డిమాండ్‌ చేశారు.

శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంల సమీపంలో లబ్ధిదారుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రైడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ సీహెచ్‌ బాలకృష్ణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి మొదటి విడత బిల్లు చెల్లించేందుకు, తదుపరి మూడు వాయిదాలకు అంతరాయం లేకుండా బిల్లులు చెల్లించేందుకు రూ.20 వేలు డిమాండ్‌ చేశారని, లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఓ ఫిర్యా దుదారుడు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పట్టుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని, అరెస్ట్‌ చేసినట్లు హైదరాబాద్‌లో జడ్జి ముందు హాజరు పరుస్తామని తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button