Andhra PradeshPolitical

ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యుత్యాహం.. బలైపోయిన నిండు ప్రాణం

ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యుత్యాహం.. బలైపోయిన నిండు ప్రాణం

ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యుత్యాహం.. బలైపోయిన నిండు ప్రాణం

రోడ్డుపై ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన అత్యుత్సాహానికి నిండు ప్రాణం బలైంది. తనిఖీల పేరుతో యువకుడు వెళ్తున్న బైక్‌ను ఆపే ప్రయత్నం చేశారు.

అయితే బైక్ రన్నింగ్‌లో ఉండగా హ్యాండిల్‌ను పట్టుకునే ప్రయత్నం చేయడంతో జారీ పోయింది. కానీ ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెరిగింది. ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న బొరేరో వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ఘటనలో యువకుడు ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరిపల్లిలో వద్ద జరిగింది. కేసరిపల్లి వద్ద రోడ్డుపై గన్నవరం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఘటన జరిగిన వెంటనే యువకుడిని అంబులెన్స్ కూడా సమాచారం ఇవ్వకుండా ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అయితే సీసీ ఫుటేజ్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రదర్శించిన అత్యుత్సాహం మొత్తం రికార్డు అయింది.

ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు . దీంతో ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. యువకుడు ప్రణయ్ ప్రాణం పోవడానికి కారణమైన వారిని వదిలపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక ప్రణయ్ కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరవుతున్నారు.

తమ కుమారుడి ప్రాణాన్ని అన్యాయంగా తీశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ తన తమ్ముడిని ట్యూషన్‌కు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రతిరోజు తండ్రి తీసుకెళ్లేవారని ఆయన లేకపోవడంతో తన తమ్ముడిని ప్రణయ్ బైక్ పై తీసుకెళ్లుండగా కానిస్టేబుల్ చేసిన అత్యుత్సాహం వల్ల ఒక ప్రాణం పోవడం.. మొత్తం ట్రాఫిక్ పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా తనిఖీల సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించొద్దని పలువురు అంటున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button