
అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృ*తి
Web desc : అనుమానాస్పద స్థితిలో డాక్టర్ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో జరిగింది. నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని శశి మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రిని అనస్థీషియా డాక్టర్ శశిధర్‌రెడ్డి (38), ఆయన భార్య గైనకాలజిస్ట్ సిందూరరెడ్డి కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. అయితే, ఏడాదిన్నర కాలం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈక్రమంలో వైద్యుడు శశిధర్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున ఇంటిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. ఆయన తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్..
లే నాన్న.. ఎంత సేపు పడుకుంటావ్. అంటూ తండ్రి గదువ పట్టుకుని అటూ ఇటూ కదుపుతున్న ఆ చిన్నారులను చూసి అక్కడున్న వారంతా కంట తడి పెట్టారు.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అనస్తీషియా డాక్టర్ శశిధర్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించగా.. అతడి కుమారులు కృతిక్, అయాన్ మార్చురీ వద్దకు వచ్చారు. డాడీ ఎందుకు పడుకున్నావు లే. అంటూ ఏడవడంతో అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు.



