
లంచం ఇచ్చినా నా పని చేస్తలేరు..ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బాధితుడు
Web desc : లంచం ఇచ్చినా అధికారులు తన పని చేయడం లేదంటూ ప్రజావాణిలో లో ఫిర్యాదు చేశాడు ఓ బాధితుడు. అడిగిన లంచం ఇచ్చినా నా పని చేస్తలేరు సార్..పైసలు ఫోన్ పే లో పంపిన మీరే న్యాయం చేయండంటూ ఓ వ్యక్తి ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం గమనార్హం.
కరీంనగర్ కు చెందిన వంకాయల మహేశ్వర్ జిల్లా సహకార కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కోడూరు హరీష్‌పై ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.
తన పని చేస్తానని చెప్పి హరీష్ రూ. 11 వేల రూపాయలు లంచం తీసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. డబ్బులు తీసుకుని పని చేయకపోగా అడిగితే కులం పేరుతో దూషించాడని కూడా ఆరోపించాడు.
జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది. డబ్బులు డిమాండ్ చేసినప్పుడు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన వ్యక్తి, ముందుగా లంచం ఇచ్చి తర్వాత పని కాలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం కూడా చర్చకు దారి తీసింది.
తెలంగాణలో ఇటీవల ప్రతీపనికి బల్లకింద చేయి చాపుతున్న అధికారుల భరతం పడుతోంది అవినీతి నిరోధక శాఖ. ఎక్కడికక్కడ భాదితుల ఫిర్యాదుతో ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుని అడ్డంగా దొరుకుతున్నారు.



