HyderabadPoliticalTelangana

అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ తలసాని…

అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ తలసాని…

అసెంబ్లీలో స్పీకర్ వర్సెస్ తలసాని…

Web desc : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్,ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

కేటీఆర్ మాట్లాడే సమయంలో మంత్రులు, స్పీకర్ పదేపదే అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్.

మీరు అందరికీ స్పీకర్ అని.. కాంగ్రెస్ కు మాత్రమే కాదని అన్నారు తలసాని. తలసాని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అందరికీ స్పీకర్ కాబట్టే మీకు మైక్ ఇచ్చానంటూ కౌంటర్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్.

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.

అన్ని వర్గాలకు ఉపయోగపడేలా యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామని.. రాష్ట్రంలో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు.

దళిత సీఎంను చేస్తామని కేసీఆర్ మోసం చేశారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ లక్షల కోట్లు అప్పు చేసిందని..బీఆర్ఎస్ చేసిన అప్పులకు తాము కిస్తీలు కడుతున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button