HyderabadPoliticalTelangana

మాజీ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డ మంత్రి సీతక్క…

మాజీ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డ మంత్రి సీతక్క…

మాజీ మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డ మంత్రి సీతక్క…

మహిళలంటే మాజీ మంత్రి కేటీఆర్‌కు చిన్నచూపని మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్‌పై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యలైనా, బయట మహిళలనైనా ఎదగనీయాలంటూ కేటీఆర్‌కు మంత్రి చురకలంటించారు.

ఫ్రీ బస్‌పై కేటీఆర్ సెటైర్లు, తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ సత్యదూరమైన మాటలు, ఎగతాళి మాటలు బంద్ చేయాలన్నారు. పదేళ్ళు మంత్రిగా మహిళల కోసం కేటీఆర్ ఏం చేశారని సీతక్క ప్రశ్నించారు.

శ్రీనిధి ద్వారా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇస్తున్నామని మంత్రి వివరించారు. మహిళలకు చెందిన అభయ హస్తం డబ్బులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలపై రూ.3000 కోట్ల భారం పెట్టిపోయిందన్నారు. కేటీఆర్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటూ మంత్రి సీతక్క పేర్కొన్నారు.

అందులో బీఆర్‌ఎస్‌ను మించిన వారు లేరు: శ్రీధర్ బాబు

మహిళా సాధికారతపై కేటీఆర్ హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘మీరు పావలా వడ్డీ ఇవ్వలేదు.. మేము ఇస్తున్నాం.

గోబెల్స్ ప్రచారంలో బీఆర్‌ఎస్‌ను మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే మీరు ఎక్కడ ఉండేవారు. ఈరోజు కాంగ్రెస్‌పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు’ అంటూ కేటీఆర్‌పై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button