
రైల్వేలో 11,127 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
Web desc : భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. భారీ సంఖ్యలో పోస్టులు ఉండటంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.
మే 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి).
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి తో పాటు ఐటీఐ , లేదా డిప్లొమా, లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
సికింద్రాబాద్ సహా అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ వంటి మొత్తం 21 రీజియన్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 15 నుంచి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.



