
యూపీఐ ద్వారా లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై
Web desc : సిద్దిపేట త్రీ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వూర్లుగొండ వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.
అవినీతి నిరోధక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్నాబాద్ పోలీసు స్టేషన్ లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఫిర్యాదు దారుడికి చెందిన ఇసుక లోడ్ లారీని విడిచి పెట్టేందుకు ఎస్ఐ వెంకటేశ్వర్లు లంచం డిమాండ్ చేశారు. యూపీఐ పేమెంట్ ద్వారా రూ. 15 వేలు లంచం తీసుకున్నట్లు గుర్తించారు.
ఈ మేరకు 2026 ఫిబ్రవరి 28 న నమోదు చేయబడిన కేసులో ప్రస్తుతం సిద్దిపేట త్రీ టౌన్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లను ఏసీపీ అధికారులు అరెస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ను సంప్రదించాలని ఏసీబీ అధికారులు కోరారు.
వాట్సఫ్ మెంబర్ 9440446106, ఫేస్ బుక్, ఎక్స్ లో కూడా సంప్రదించవచ్చు అన్నారు. ఫిర్యాదు దారుడి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.



