HyderabadPoliticalTelanganaVikarabad

వికారాబాద్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

వికారాబాద్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

వికారాబాద్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Web desc : వికారాబాద్ జిల్లాలోని ఓ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలో ఈ ఘటన జరిగింది.

Sugna Metals Limited కంపెనీలో ఒక్కసారిగా స్టీల్ ప్లాంట్ బట్టీ పేలడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ వెలువడుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఈ పేలుడు ఘటన సమయంలో కంపెనీలో ఉన్న పలువురు కార్మికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావలసి ఉంది. పేలుడు నేపథ్యంలో కంపెనీ యాజమాన్యం ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు.

దీనిపై మీడియా కంపెనీని ప్రశ్నించగా.. లారీటైర్ పేలిందని వాస్తవాలను దాచే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

పరిస్థితి అదుపులోకి వచ్చాకే ఎవరైనా గాయపడ్డారా? ప్రమాదానికి గల కారణాలేంటి? అనే విషయాలు తెలిసే అవకాశం ఉందని ఫైరింజన్ అధికారులు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button