
సోనియా గాంధీకి అస్వస్థత… ఆసుపత్రికి తరలింపు
Social media viral :
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం రాత్రి దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల కోసం చేరారు.
డాక్టర్లు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె అనారోగ్యానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడి కాలేదు.
సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు ఆమె వెంట లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఆమె వెంట ఉన్నారు. అబ్జర్వేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచారం.
రెండు రోజులుగా కొంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, రాత్రి ఆరోగ్యపరంగా తీవ్ర అసౌకర్యానికి గురి కావడం, అదే సమయంలో దగ్గు ఎక్కువగా రావడం వల్ల ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
సోనియాగాంధీ గంగారామ్ ఆసుపత్రిలో ఛెస్ట్ స్పెషలిస్ట్ సారథ్యంలోని డాక్టర్ల టీమ్ పర్యవేక్షణలో ఉన్నారు. డాక్టర్లు ఆమె ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తోన్నారు. సాధారణ చెకప్ నిర్వహిస్తున్నారు. సోనియా గాంధీ మెడికల్ హిస్టరీ ప్రకారం.. ఆమె క్రానిక్ కాఫ్ (తీవ్ర దగ్గు)తో బాధపడుతున్నారు.
ఈ సమస్యతో ఈ ఏడాది జనవరిలో కూడా ఆమె గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అధిక వాయు కాలుష్యం ఉన్నప్పుడు ఆమె క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటారు.
ఆమె దీర్ఘకాలిక దగ్గు సమస్యతో బాధపడుతుండటం, ఢిల్లీ కాలుష్య స్థాయి పెరిగిన నేపథ్యంలో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకుంటోన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటారు, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
2025లో కూడా సోనియా గాంధీ మూడు సార్లు వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. గత ఏడాది ఫిబ్రవరిలో కడుపు సంబంధిత సమస్యలతో సర్ గంగారామ్‌లో చేరారు.
అదే ఏడాది జూన్‌లో మళ్లీ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. అదే నెలలో హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్నప్పుడు స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో సిమ్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.




