
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు.. 10మంది సజీవదహనం
Web desc : ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టిప్పర్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో 10మంది సజీవదహనమయ్యారు.ఈ విషాదకర రోడ్డు ప్రమాదం మార్చి 26 గురువారం ఉదయం మర్కాపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు జగిత్యాల నుంచి ఉదయగిరి వెళ్తుండగా.. మర్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో అదుపుతప్పి టిప్పర్ ను ఢీకొట్టింది.
దీంతో మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి. బస్సుల్లో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మంటల్లో కాలిపోయి సజీవదహనమయ్యారు. మరికొంతమంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేసి బస్సులో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




