Mahabub nagarPoliticalTelangana

సేవ ట్రస్ట్ పేరుతో అక్రమ వసూళ్లకు తెరలేపిన కేటుగాళ్లు

సేవ ట్రస్ట్ పేరుతో అక్రమ వసూళ్లకు తెరలేపిన కేటుగాళ్లు

సేవ ట్రస్ట్ పేరుతో అక్రమ వసూళ్లకు తెరలేపిన కేటుగాళ్లు

Web desc : అక్రమార్జనే ధ్యేయంగా ముఠాగా ఏర్పడి సేవా ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్ పేరుతో లక్షల రూపాయల చందాలు వసూలు చేస్తూ చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పట్టుబడ్డ వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు జడ్చర్ల పోలీసులు.

మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో సేవా ట్రస్ట్ చందాల పేరుతో అక్రమంగా వసూలు చేస్తున్న ముఠాను స్థానిక వ్యాపారులు అనుమానంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఉమ్మడి జిల్లాతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి అక్రమార్జనే ధ్యేయంగా ఆదర్శ వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ సొసైటీ, అమ్మానాన్న సేవా ట్రస్ట్ పేరుతో చందా బుక్కులను తయారు చేసి జడ్చర్లలో వ్యాపారస్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుండడంతో అనుమానం వచ్చిన వ్యాపారులు వారిని నిలదీయడంతో అసలు రూపం బయటపడింది.

దీంతో పట్టుబడ్డ ఐదుగురిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. వారి నుండి ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా పట్టుబడ్డ వారి నుంచి నకిలీ రిసిప్ట్ లు స్వాధీనం చేసుకొని విచారణ చేపడుతున్నారు పోలీసులు.

అయితే సేవ ట్రస్టుల పేరు పై ఒక్కో వ్యాపారి నుంచి 5000 నుంచి 25 వేల వరకు సుమారు 50 మందికి పైగా వ్యాపారులతో ఇప్పటికే వసూలు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాదులో అమ్మానాన్న సేవ ట్రస్టు నిర్వహిస్తున్న నిర్వాహకులకు సమాచారం ఇవ్వడంతో తమకేమీ సంబంధం లేదని తమ ట్రస్టు పేరు పై ఎవరో అక్రమంగా వసూలు చేస్తున్నారని వారి పై కూడా చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదు చేస్తామని ట్రస్టు నిర్వాహకులు పోలీసులకు వివరించారు.

అయితే ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు కేటుగాళ్లు సేవా ట్రస్టుల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది.

అయితే పట్టుబడ్డ వారంతా కొల్లాపూర్, వనపర్తి వంటి ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాంతంతో పాటు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు కూడా కలిగి ఉండడంతో మరి ఇంకా ఎక్కడైనా ఇలాంటి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారా..? లేదా..? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఇలా ట్రస్టుల పేరుతో సేవ కేంద్రాల పేరుతో ఎవరైనా చందాలకు వస్తే నిజాలు తెలుసుకుని వారు నిజంగానే సేవ ట్రస్ట్ వారేనా లేదో తెలుసుకొని ప్రజలు, వ్యాపారులు చందాలు ఇవ్వాలని ఏదైనా అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్ తెలిపారు. ఇలా సేవా ట్రస్ట్ ల పేరుతో అక్రమ వసూళ్లకు తెరలేపడంతో నిజంగానే సేవా ట్రస్ట్ నడిపే వారికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button