
హాస్టల్ గదిలో బీటెక్ విద్యార్థి ఆత్మ*హత్య….
హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహ*త్యకు పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, నందిగూడెం మండలం, శ్రీరంగపురం గ్రామానికి చెందిన కందిమల్ల నాగేశ్వర్ రావుకు సాయి(20) అనే కుమారుడు ఉన్నాడు.
కాగా, సాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని దివ్య హాస్టల్లో ఉంటూ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్ గదిలోని రూమ్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.



