
స్వామి ఊరేగింపులో కాంగ్రెస్ V/S బీఆర్‌ఎస్…
రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు…
Web desc : వైరా మున్సిపాలిటీ పరిధి కొణిజర్ల మండలం లాలాపురంలో బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామి ఊరేగింపు జరుగుతుండగా మొదలైన వివాదం రాళ్ల దాడిగా మారడంతో పలువురు గాయపడ్డారు.
ఎస్సై సురేష్ తెలిపిన వివరాలు…. కాంగ్రెస్ వర్గీయులు సీతారాముల కళ్యాణం అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తుండగా, బీఆర్‌ఎస్ వర్గీయుల ఊరేగింపు ఎదురురావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమాన రాళ్లు రువ్వుకోగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి.
ఈ విషయం తెలియడంతో వైరా సీఐ వెంకటప్రసాద్ నేతృత్వాన కొణిజర్ల, వైరా, చింతకాని పోలీసులు చేరుకుని ఇరువర్గాల చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆపై గ్రామంలో పోలీసులు పికెట్ ఏర్పాటుచేశారు.




