
అసెంబ్లీ హాలులో వింత ఘటన
అసెంబ్లీ సమావేశాల వేళ శనివారం హాలులో వింత ఘటన కనిపించింది. అప్పటి వరకు మైనింగ్ మీద అధికార, ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఆ వెంటనే ఒకటి రెండు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన స్పీకర్.. ఆ తరువాత సభను ఆదివారానికి వాయిదా వేశారు. అయితే.. ఎప్పుడైనా సభ ముగిసిన తరువాత సభ్యులంతా హాల్ ఖాళీ చేసి వెళ్లిపోవడం కామన్.
కానీ, శనివారం మాత్రం హాలులో నుంచి స్పీకర్, సీఎం, కాంగ్రెస్ సభ్యులంతా వెళ్లిపోయినా బీఆర్ఎస్ సభ్యులు మాత్రం అందులోనే ఉండిపోయారు.
సభ ముగిసిన తరువాత 20 నిమిషాల పాటు సభ్యులంతా ఒక దగ్గరకు చేరి చర్చించుకున్నారు. అయితే.. హాలులో ఉన్న అధికారులతో వివేక్ మాట్లాడుతుండగా..
ఆయనను పిలిచి మరీ సెటైర్ వేశారు. ‘వివేక్ అన్నా.. మొత్తానికి సాధించావ్’ అంటూ ఆయనపై కేటీఆర్ సెటైర్ వేశారు. మైనింగ్ అక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించడంతో వివేక్‌పై ఈ సెటైర్ వేశారని సభ్యులు తెలిపారు.



