HyderabadPoliticalTelanganaVikarabad

దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆస్తి ఇవ్వని తండ్రి..సెల్‌ఫోన్ టవర్‌ ఎక్కిన కొడుకు

దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆస్తి ఇవ్వని తండ్రి..సెల్‌ఫోన్ టవర్‌ ఎక్కిన కొడుకు

దళిత యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆస్తి ఇవ్వని తండ్రి..సెల్‌ఫోన్ టవర్‌ ఎక్కిన కొడుకు

తండ్రి తనకు ఆస్తి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురైన ఓ కొడుకు సెల్‌ టవర్‌ ఎక్కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం కేసారంలో శనివారం జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.

గ్రామానికి యాదయ్య కుమారుడు నాగరాజు అలియాస్‌ (నరేందర్‌) (40) పదిహేనేళ్ల క్రితం ఏపీలోని గుంతకల్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. భార్య, ఇద్దరు కుమారులతో కలిసి అక్కడే ఉంటున్నాడు.

ఇటీవల ఒంటరిగా గ్రామానికి వచ్చిన నాగరాజు.. తండ్రి పేరున ఉన్న 15 గుంటల భూమిని తనకు రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యకు ప్రయత్నించగా ఆస్పత్రిలో చికిత్స చేయించారు.

తమ భూమిని, ఇంటిని ఎవరూ కొనుగోలు చేయొద్దని, ఒకవేళ అలా కొనుగోలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ఆస్తిని తిరిగి స్వాదీనం చేసుకుంటానంటూ శుక్రవారం నోట్‌ రాసి పంచాయతీ కార్యాలయానికి అందజేశాడు.

ఆ తర్వాత శనివారం ఉదయాన్నే మద్యం తాగి గ్రామంలోని సెల్‌ టవర్‌ ఎక్కాడు. తండ్రి ఆస్తిని తన పేరున రిజిస్ట్రేషన్ చేస్తేనే దిగుతానని, లేదంటే ఇక్కడే ఉరేసుకుని చనిపోతానని బెదిరించాడు.

అతనితో మాట్లాడిన స్థానికులు భూమి ఇప్పిస్తామని చెప్పినప్పటికీ టవర్‌పై ఉన్న ఓ తీగతో ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్, ఎస్‌ఐ భరత్‌భూషణ్‌ సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్‌ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని దించారు.

కొడుకు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నందున ఆస్తి ఇవ్వడానికి తండ్రి నిరాకరించడంతో.. నాగరాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్‌ఐ తెలిపారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button