Andhra PradeshEducationPolitical

పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి పాముకాటు.. ఏం కాదంటూ ఎగ్జామ్ రాయించిన ఇన్విజిలేటర్!

పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి పాముకాటు.. ఏం కాదంటూ ఎగ్జామ్ రాయించిన ఇన్విజిలేటర్!

పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి పాముకాటు.. ఏం కాదంటూ ఎగ్జామ్ రాయించిన ఇన్విజిలేటర్!

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని పాముకాటుకు గురైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. అయితే పాము కాటు వేసిన విషయాన్ని సదరు విద్యార్థిని ఇన్విజిలేటర్‌కు చెప్తే.. ఇన్విజిలేటర్ ఏమీకాదని.. భయపడకుండా పరీక్ష రాయాలని సూచించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని విద్యార్థిని వెల్లడించటం విస్మయపరుస్తోంది.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. బసినికొండకు చెందిన అఫ్రన్ అనే విద్యార్థిని పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తోంది. మదనపల్లెలోని జెడ్పీ హైస్కూలు ఆమె పరీక్షా కేంద్రం. రోజూలాగేనే శనివారం రోజున బయాలజీ పరీక్ష రాసేందుకు అఫ్రన్ పరీక్షా కేంద్రానికి వచ్చింది.

9 గంటల 30 నిమిషాలకు పరీక్ష ప్రారంభం కాగా.. అష్రన్ పరీక్ష రాయటం మొదలుపెట్టింది. అయితే ఇంతలోనే పరీక్షా హాలులోకి పాము ప్రవేశించడాన్ని.. అఫ్రన్ సమీపానికి రావటాన్ని కొంతమంది విద్యార్థులు గుర్తించారు.

వెంటనే పాము అంటూ గట్టిగా కేకలు వేశారు. ఈ కేకలు విన్న అఫ్రన్ అప్రమత్తమయ్యేలోపే.. పాము అఫ్రన్ కాలు మీద కాటువేసింది. దీంతో భయపడిపోయిన అఫ్రన్ వెంటనే ఈ విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేసింది.

అయితే ఏమీ కాదని.. భయపడకుండా పరీక్ష రాయాలని ఇన్విజిలేటర్ సూచించినట్లు అఫ్రన్ చెబుతోంది. మరోవైపు తమ పాపకు పాము కరిస్తే స్కూలు యాజమాన్యం, ఇన్విజిలేటర్ కనీసం సమాచారం ఇవ్వలేదని విద్యార్థిని తల్లి ఆరోపిస్తు్న్నారు.

పరీక్ష పూర్తి చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకు అఫ్రన్ ఇంటికి వచ్చిందని.. తాను ఇంటికి వెళ్లేసరికి ఒంటి గంట అయ్యిందని అఫ్రన్ తల్లి చెప్తున్నారు.

పాము కరిచిన విషయాన్ని తనకు చెప్తే.. వెంటనే ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తెలిపారు. విద్యార్థిని అఫ్రన్‌ను పరీక్షించిన వైద్యులు.. ఆందోళన అవసరం లేదని తెలియజేయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అయితే పరీక్ష రాస్తు్న్న సమయంలో పాము కరిస్తే కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోతే ఎలా అంటూ విద్యార్థిని తల్లి మండిపడుతున్నారు. మరోవైపు పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రారంభం రోజు కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.

వైఎస్సార్ కడప జిల్లా బి. కోడూరులోని పదో తరగతి పరీక్షా కేంద్రంలోకి ఓ పాము ప్రవేశించటం కలకలం రేపింది. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో పాము.. తరగతి గదిలోకి ప్రవేశించింది.

పామును చూసిన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే స్కూలు సిబ్బంది వెంటనే స్పందించి పామును చంపేసి బయటకు విసిరేయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button