
నమస్తే” జిల్లా పెద్ద సారు / జర మా గోడు చూడు..
“కమర్షియల్ గ్యాస్ కొరత, వ్యాపారస్తులకు తల కొరివి గా మారింది.”
“ములుగు జిల్లా లో గ్యాస్ నిల్వ పై.! తనిఖీ అధికారుల మాట నిజమేనా.?”
“రికార్డ్స్ లోనే కమర్షియల్ గ్యాస్ ఫుల్ – గోదాం లో గ్యాస్ నిల్.”
“స్టాక్ రాక – గ్యాస్ వినియోగదారులకు సమాధానం చెప్పలేక.! సతమతం అవుతున్న డీలర్లు.”
“గ్యాస్ బుకింగ్ పై ఓటిపి తిప్పలు.”
“చిరు వ్యాపారస్తులకు తలకొరివి గా మారిన కట్టే’ కష్టాలు..”
“అరణ్యం లో కట్టే” ముట్టద్దు అని కబుర్లు చెప్పిన ప్రభుత్వంలో గ్యాస్ కష్టాలు..”
“అమ్మ పెట్టదు, ఆ***కొని తిననివ్వదు అనే సామెత మాదిరిగా. గ్యాస్ యాజమాన్యం ఆంక్షలు.”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్.”
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంట గ్యాస్ నిల్వ విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవం అనే అంశం గురించి రాష్ట్ర ప్రజలంతా సందిగ్ధంలో పడ్డారు… ఇతర దేశాలలో “నిజంగా” జరుగుతున్న యుద్దాలను చూసి భయపడాలో.!
“లేక” గ్యాస్ నిల్వ పై కొంతమంది అధికారులు చెబుతున్న “అబద్ధపు” స్టేట్మెంట్ విని మోసపోవాలో అర్థం కాని అయోమయ స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు… ఇది ఇలా ఉండగా వంట గ్యాస్ వినియోగదారులు ఎవరికి వారే ఫోన్ ద్వారా గ్యాస్ ను ఆన్లైన్ చేసుకునే ప్రక్రియలో సకాలంలో ఓటీపీ రాక.!
పోనీ గ్యాస్ గోదాం దగ్గరికి వెళ్లి విషయాన్ని తెలుసుకుందాము అంటే” గ్యాస్ కొరతతో అప్పటికే విసుగు చెందిన గ్యాస్ సిబ్బంది సమాధానం సరిగ్గా లేక.! ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే’ చిరు వ్యాపారస్తుల అవస్థలు అంతా ఇంతా కాదు,
కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అందుబాటులో “లేక” ప్రతి ఆహార కొనుగోలు పై ధర పెంచడంతో మధ్యతరగతి ప్రజలు ఆహారాన్ని కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారం అవుతుంది…చిరు వ్యాపారస్తులకి బేరాలు లేక.! షాపులు దివాలా తీసే స్థాయికి చేరుతున్నాయి..
ప్రభుత్వం చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది దో***గుడిసెలు అనే సామెతల కమర్షియల్ సిలిండర్ పై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడమే కాదు. గ్యాస్ నిల్వ పై కూడా ప్రభుత్వానికి శ్రద్ధ ఉండాలి అంటూ కొంతమంది వ్యాపారస్తులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు..
ఇకనైనా జిల్లా యంత్రాంగం కళ్ళు తెరిచి” మండల అధికారులు ఇచ్చే అబద్ధపు స్టేట్మెంట్ నమ్మడం మానేసి మారుమూల ప్రాంతాలలో గ్యాస్ కొరతపై దృష్టి సాదించాలంటూ గ్యాస్ వినియోగదారులు వేడుకుంటున్నారు..




