
హోంగార్డుల బదిలీలపై ఇంత నిర్లక్ష్యమా ?
ఎంతకాలం విన్నవించాలి..ప్రభుత్వాలకు పట్టదా?
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు స్పందించాలి
స్థానికత కలిగిన 200 మంది హోంగార్డులను సత్వరమే బదిలీ చేయాలి
-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
అమరావతి:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అనేక మార్లు రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించినప్పటికీ..నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నుంచి హోంమంత్రి వంగలపూడి అనితకు, సీఎస్‌తోపాటు డీజీపీకి అనేక మార్లు లేఖలు రాసినప్పటికీ, స్వయంగా వినతులు ఇచ్చినప్పటికీ పట్టనట్టు ఉన్నారన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వంలోని ప్రజాఫ్లతినిధులకు ప్రాంతాల వారీగా మంత్రులుగా తగిన శాఖలు కేటాయించుకుని లబ్దిపొందుతారని, వారికి కావాలిసిన సౌకర్యాల్ని, రాయితీలను మాత్రం పూర్తి స్థాయిలో పొందుతున్నారని పేర్కొన్నారు. అదే సామాన్య హోంగార్డులకు చిన్న బదిలీ సమస్యను మాత్రం ఉభయ రాష్ట్రాల్లో ఎన్ని ప్రభుత్వాలు మారినా వాటిని పట్టించుకోవడంలేదన్నారు.ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు ప్రభుత్వం హోంగార్డుల సమస్యలపై ఆలకించడంలేదని, ఎన్ని వినతులు చేసినవా అవి బుట్టదాఖలవుతున్నాయని వివరించారు. 15 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైన దాదాపు 200 మంది హోంగార్డులు చాలీచాలని రోజు వారి వేతనాలతోను, కుటుంబాలకు దూరంగా ఉంటూ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారంతా రాష్ట్ర స్థానికతను కలిగి ఉన్నారని, ఇంటర్మీడియట్ వరకు వారి చదువు రాష్ట్రంలోనే కొనసాగిందని, దీంతో వారు తెలంగాణలో నాన్ లోకల్‌గా పరిగణించబడుతున్నారని పేర్కొన్నారు. ఈ కారణాలతో తెలంగాణలోని కానిస్టేబుల్ ఎంపికలో హోంగార్డులకు ఇచ్చే వెసులుబాటును కోల్పోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర కానిస్టేబుల్ ఎంపికలో దరఖాస్తు చేసుకోగా, వారి సర్వీసు తెలంగాణలో ఉండటంతో..వారికి రాష్ట్ర కోటా వర్తించబోదని చెబుతున్నారని, ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హోంగార్డులు నష్టపోతున్నారన్నారన్నా




