
గురుకుల పాఠశాలలో దాష్టీకం.. అన్నం సరిపోలేదన్నందుకు రాత్రంతా.. మోకాళ్లపై కూర్చోబెట్టి!
Social media viral : అన్నం సరిపోలేదు ఆకలవుతుంది.. కొంచెం అన్నం పెట్టండి’ అన్నందుకు ఆ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై తన ఆగ్రహాన్ని చూపించింది.
మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్‌లో నిర్వహిస్తున్న దామరచర్ల బీసీ గురుకుల పాఠశాలలో సోమవారం రాత్రి భోజనం సమయంలో అన్నం సరిపోలేదు.. ఆకలి అవుతుంది..
మరికొంచెం పెట్టండని విద్యార్థినిలు రిక్వెస్ట్ చేశారు. ఒక్క మాటతోనే పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులపై నరసింహుడి అవతారం ఎత్తి తిట్ల దండకం చేశారు.
అంతటితో ఆగకుండా మోకాళ్లపై కూర్చోబెట్టి విద్యార్థులను వేధించారని తెలిసింది. కనీసం ఆ తర్వాత నైనా భోజనం పెట్టారంటే అది కూడా లేకుండానే ఆ రాత్రంతా ఖాళీ కడుపుతో పడుకోబెట్టారు.
తల్లిలా ఆదరించాల్సిన ప్రిన్సిపాల్ విద్యార్థులను మానసిక శారీరక వేధింపులకు గురిచేస్తున్న తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతరం ఈ సంఘటనకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌తో పాటు మిగతా వాళ్లందరిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.




