HanumakondaPoliticalTelangana

కేయులో ఎలుకల కలకలం... 14 మంది విద్యార్థినుల పాదాలకు గాయాలు

కేయులో ఎలుకల కలకలం... 14 మంది విద్యార్థినుల పాదాలకు గాయాలు

కేయూలో 14 మంది విద్యార్థినుల పాదాలను కొరికిన ఎలుకలు

హన్మకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయం సమ్మక్క- సారక్క మహిళా హాస్టల్ లో ఎలుకలు వీరంగం సృష్టిస్తున్నాయి. ప్రతీ విద్యా సంవత్సరంలో కేయూ హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థులు, విద్యార్థినులు దాదాపు వారంలో ఒకరు ఇద్దరు నుంచి పది మంది స్టూడెంట్స్ ఎలుకల గాట్లకు గురై హాస్పటల్ పాలవుతున్నారు.

ఎలుక, బల్లి, కుక్క వరకు ఏ జంతువు కరిచినా యాంటి రాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ భయంతో ఎక్కడ తమకు రాబిస్ వ్యాధి సోకుతుందో అన్న భయంతో విద్యార్థులు ,స్టూడెంట్స్ టానిక్ అయి ఫార్మసీకి పరిగెత్తితే ఫార్మసీలో మందులు లేక తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

రాత్రిపూట మెడికల్ అడ్వైజర్స్ అందుబాటులో లేక మరుసటి రోజు వరకు వేచి ఉండి మర్నాడు ఆరోజు ఎటువంటి అకాడమిక్ పరీక్షలు లేకుంటే.. ప్రైవేట్ క్లినిక్స్ , ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఆధారపడుతున్నారు.

విద్యార్థులకు అనారోగ్య సమస్యలకు సంబంధించి ఎలకల నుంచి ఇబ్బందులు, విద్యార్థినులకైతే కడుపునొప్పి, ఆకస్మిక వాంతులు, తదితర అనారోగ్య సమస్యలకు సంబంధించి మానిటరింగ్ చేసే సమర్థవంతమైన బాధ్యతతో ఉండే వ్యవస్థ యూనివర్సిటీలో లేదంటే అతిశయోక్తి కాదు.

ఇటువంటి వాటికి ఉదాహరణలు కోకొల్లలు. ఇలా సమస్యలు చెబుతుంటే ఎక్కువగా మాట్లాడుతున్నారేంటి..! మీ మెస్ కార్డులు రద్దు చేస్తే రోగం కుదురుతుందంటూ ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండండి అంటూ నిరుపేద విద్యార్థినిలతో పరుషంగా డైరెక్టర్లు మాట్లాడుతున్నట్టు సమాచారం.

ఒక అమ్మలా బాధ్యత వహించాల్సిన మహిళా ఉద్యోగులు యూనివర్సిటీ మహిళా విద్యార్థుల ఆవేదనలను అర్థం చేసుకోకుంటే మరెవరు అర్థం చేసుకుంటారు అని విద్యార్థినిలు పేర్కొంటున్నారు. హాస్టల్ డైరెక్టర్, ఇన్ చార్జి సిబ్బందితో చెప్పినప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చెబుతున్నారని విద్యార్థినులు వాపోతున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో డైరెక్టర్ కు, ఇన్ చార్జి డైరెక్టర్, వార్డెన్ కు ఫోన్స్ చేసినా కూడా ఏమాత్రం ఆన్సర్ చేయడం లేదని కొన్నిసార్లు అయితే తాము స్థానికంగా లేమని, వచ్చాక చూసి పరిశీలిస్తామని పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటున్న తమను తమకు ఏదైనా అవాంతరం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హాస్టల్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన చెత్త కుప్పలుగా పేరుకుపోవడం కూడా ఒక కారణమని తెలిపారు. హాస్టల్ గదులు శుభ్రంగా లేకపోవడంతో ఎలుకల సంఖ్య పెరిగిపోయింది.

ఎలుకలతో పాటు పాములకూ హాస్టల్లే నెలవయ్యాయని కుక్కల సంగతైతే చెప్పనక్కర్లేదు. ఇక భోజనం కోసం హాస్టళ్లకు వెళ్లి క్లాస్ రూములకు వస్తున్న సందర్భంలో పలువురు స్టూడెంట్స్ కుక్కల భయానికి గుంపులు గుంపులుగా వెళ్తున్నారు.

హాస్టల్ పరిసర ప్రాంతాలను శుభ్రపరిచి హాస్టల్ గదులకు కిటికీలకు మెష్ డోర్లు బిగించాలని ఎలుకలు, పాములు, కుక్కల బెడద ను తప్పించాలని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేయూ విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది కాలంగా మహిళా హాస్టల్స్ లో విద్యార్థినిలను ఎలుకలు కరుస్తున్నాయని అధికారులకు చెప్పాం. అయినప్పటికీ పట్టించుకోకపోవడం లేదు. ఎలుకలకు భయపడి నిద్రపోవడం లేదు.

హెల్త్ సెంటర్ కి వెళ్లితే.. టీటీ కానీ ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్స్ అందుబాటులో ఉండకపోవడంతో చేసేదేమి లేక బయట హాస్పిటల్ లో చికిత్సకి వెళ్తున్నట్టు దాదాపు రెండు, మూడు వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. కేయూ అధికారులు దృష్టి సారించి ఇప్పటికైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి హాస్టల్స్ లో నివాసముంటూ చదువుకుంటున్న విద్యార్థినిల సమస్యలను పరిష్కరించి వారి భవిష్యత్ పట్ల ప్రోత్సహించాలని కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button