
లంచం తీసుకుంటూ వీడియోకు చిక్కిన ఎస్ఐ..
Web desc : జరిమానా చెల్లించిన ఇసుక వ్యాపారి వద్ద లంచం తీసుకుంటూ వీడియోకు చిక్కిన ఎస్ఐని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో సోమవారం జరిగింది.
ఇసుక వ్యాపారం చేస్తు న్న వ్యక్తి ట్రాక్టర్, ఎక్స్కవేటర్లపై తిమ్మాజిపేట ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి ఈ నెల ఐదో తేదీన కేసు నమోదు చేశారు.
ఈ కేసును విచారించిన జిల్లా మైనింగ్ అధికారులు సదరు వాహనాలపై విధించిన రూ.60 వేల జరిమానా చెల్లించిన ఇసుక వ్యాపారి తన వాహనాలను విడుదల చేయాలని ఈ నెల 7న ఎస్ఐని కోరాడు.
తనకు రూ.30 వేలు లంచం కావాలని డిమాండ్ చేసిన ఎస్ఐ హరి ప్రసాద్‌రెడ్డికి సదరు వ్యాపారి రూ.20 వేలు చెల్లిస్తూనే మరోవైపు వీడియో, ఆడియో రికార్డు చేసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌కు సోమవారం చేరుకుని కేసు నమోదు చేసి, ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డిని అరెస్టు చేశామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.



