HyderabadPoliticalSanga reddyTelangana

ఆస్తి కోసం తండ్రిని చం*పిన కొడుకు...

ఆస్తి కోసం తండ్రిని చం*పిన కొడుకు...

ఆస్తి కోసం తండ్రిని చం*పిన కొడుకు… సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో దారుణం

ఆస్తి కోసం తండ్రిని చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సంచలనం రేపింది. జహీరాబాద్‌ పట్టణ సీఐ శివలింగం, ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం భూచన్‌పల్లికి చెందిన తాజుద్దీన్‌ (50) కొంతకాలంగా జహీరాబాద్‌ పట్టణం భరత్‌నగర్‌లో నివసిస్తున్నాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబసభ్యులతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

సొంత గ్రామమైన భూచన్‌పల్లిలో తాజుద్దీన్‌కు చెందిన భూమికి సంబంధించి భార్య రిజ్వానా, కొడుకు ఖాజా, కూతురు బిపాషాతో గొడవ జరుగుతున్నది. ఈ క్రమంలోనే బుధవారం వారి మధ్య గొడవలు ముదరడంతో తాజుద్దీన్‌ కండ్లల్లో కారంచల్లి, కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు.

తీవ్రంగా గాయపడిన తాజుద్దీన్‌ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు. జహీరాబాద్‌ పట్టణ సీఐ శివలింగం, ఎస్‌ఐ వినయ్‌కుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు పాల్పడిన రిజ్వానా, ఖాజా, బిపాషాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button